హుస్నాబాద్ టౌన్, జూన్ 16 : కష్టపడేవారికి ఎప్ప టికీ ఫలితం దక్కుతుందని, నమ్ముకున్న వృత్తి ఎన్నడూ చెడగొట్టదనడానికి ఈ కుటుంబమే నిదర్శనం. చెప్పుల తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబానికి నేటి సమాజంలో ఫ్యాషన్‌గా వేసవిలో ఎక్కువగా ఉపయోగించే కొలపురి చెప్పులను తయారు చేస్తున్నది. తెలంగాణ జిల్లాలోనే కొలపురి చెప్పుల తయారీకి హుస్నాబాద్ ప్రాంతం నిలయంగా మారింది.
జిల్లాలోని చిన్నకోడూర్ గ్రామం నుంచి 30 ఏండ్ల కింద హుస్నాబాద్‌కు సింది రాజయ్య కుటుంబం వలస వచ్చింది. స్థానికంగా టైర్లతో చెప్పులను తయారీ చేస్తూ జీవనం సాగించిన కుటుం బం ఆయా ప్రాంతాలకు ఎగుమతిచేసే స్థాయికి ఎదిగింది. చాలా ఏండ్లుగా ప్రజలకు సుపరిచితమైన బెటర్ చెప్పు ల తయారీ నాంది ఇక్కడే పలికింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కటాయి లెదర్ చెప్పులపై ప్రజల మక్కువ తగ్గడంతో కొత్తగా కొలపురి చెప్పులను తయారు చేస్తూ రాణిస్తున్నారు.
ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొలపురి చెప్పులను కొనుగోలు చేసిన శ్రీనివాస్ తాను కూడా ఇలాంటి చెప్పులను తయారు చేయాలని భావించాడు. మూడేండ్ల క్రితం గుగూల్లో పరిశోధన చేసిన అతడు కొలపురి చెప్పులకు ఉపయోగించే ముడిసరుకు ప్రాంతాన్ని తెలుసుకున్నారు. 8 నెలలు కష్టపడి కొలపురి చెప్పులను వివిధ రకాల డిజైన్ల లో తయారీ చేశా రు. హుస్నాబాద్‌లో తయారు చేసిన ఎనమిది రకాల డిజైన్ చెప్పులు మన్నికగా, ఆకర్షణీయంగా ఉండడంతో డిమాండ్ అధికంగా ఉంది.
చెప్పుల తయారీకి ఉపయోగపడే సరుకులను మ ద్రాస్ నుంచి తీసుకువచ్చి, స్థానికంగానే కటింగ్, డిజైన్లకోసం చిన్న యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఏడాదిలో 8 నెలల పాటు చెప్పులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తల్లి బాలవ్వతోపాటు భార్య, కొడుకులు సైతం చెప్పుల తయారీలో నిత్యం పాలు పంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా చెప్పుల తయారీలో కష్టపడి నెలకు రూ.30వేల వరకు సంపాదిస్తున్నారు.
ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు నెలకు రెండు వేలకు పైగా చెప్పుల జతలను తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జత చెప్పులకు రెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుండగా, పది రూపాయల లాభంపై హైదరాబాద్, నిజామాబాద్, పరకాల తదితర ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు ఎగుమతి చేస్తున్నారు. మిగతా ప్రాంతాలకు చెందిన కొలపురి చెప్పులకంటే హుస్నాబాద్ చెప్పులకే వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు హుస్నాబాద్‌లో తయారైన చెప్పులను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటున్నారు.
తన తండ్రి చూపించిన బాటను వదల్లేదు. బతుకుదెరువునిచ్చిన చెప్పులను తయారీ చేస్తూ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు ఎగుమతి చేస్తున్నది ఈ కుటుంబం. మూడేండ్ల క్రితం తయారుచేసిన 24 జతల కొలపురి చెప్పులను డిస్ట్ట్రిబ్యూటర్కు ఇవ్వగా, ఐదు నిమిషాల్లోనే వాటిని వినియోగదారులు ఇష్టపడి కొనుగోలు చేయడంతో సదరు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కొలపురి చెప్పుల తయారీకి ఈ కుటుంబం శ్రీకారం చుట్టింది. దీంతో కొలపురి చెప్పుల తయారీ పరిశ్రమకు హుస్నాబాద్ కేరాఫ్‌గా మారింది.
బెన్ఫిట్ చెప్పులను తయారీ చేసి మాకు బతుకునిచ్చిన మానాన్న రాజయ్యే మాకు స్ఫూర్తి. మా నాన్న ప్రోత్సాహంతోనే కొలపురి చెప్పుల తయారీ చేయడం మొదలుపెట్టిన. మేం తయారు చేసే చెప్పులు క్వాలిటీ ఉంటాయి. మిగతా వారి చెప్పులు తొందరగానే ఊడిపోతాయి. అన్ని రకాల సైజ్లు సైతం మేం తయారుచేస్తం కాబట్టే హుస్నాబాద్ కొలపురి చెప్పులంటే అందరికీ ఇష్టం.
– సింది శ్రీనివాస్, కొలపురి చెప్పుల తయారీ యజమాని, హుస్నాబాద్