మెదక్రూరల్/ టేక్మాల్/ చిలిపిచెడ్/ వెల్దుర్తి/ రామాయంపేట, జూన్ 15 : విద్యాభివృద్ధ్దిలో భాగంగా సీఎం కేసీఆర్ ‘మనఊరు-మన బడి’ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడులకు అన్ని వ సతులు కల్పిస్తుండడంతో కొత్తరూపు సంతరించుకుంటున్నా యి. టీచర్లు, ప్రజాప్రతినిధులు బుధవారం ప్రతి గ్రామంలో బడిబాట నిర్వహిస్తున్నారు. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. సర్కారు బడుల్లో లభిస్తున్న వసతులు, సదుపాయాలు, నాణ్య మైన విద్యాబోధనపై కరపత్రాలను పంపిణీ చేస్తూ వివరిస్తున్నారు.
మెదక్ మండలంలోని పేరురూ ప్రాథమిక పాఠశాలను మం డల విద్యాధికారి నీలకంఠం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో బడిబాట వివరాలను రిజిస్టర్ నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమం లో టీచర్లు లింగాగౌడ్, అమ్మిరుద్ద్దీన్, సీఆర్పీ జ్వోతి ఉన్నారు.
టేక్మాల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిటాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో నీలకంఠం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో విద్యాబోధన చేస్తు న్నట్లు తెలిపారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఉచిత యూనిఫాం, స్కాలర్షిప్ సదుపాయాలు కేవలం ప్రభు త్వ పాఠశాలల్లో మాత్రమే ఉంటుందన్నారు.
కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ అజీజ్ అహ్మద్,వెంకటరమణ, రజిత, స్వప్న, మమత, అశ్విని, దుర్గా పసాద్, మచ్చెందర్, మొగులయ్య, విమయ్, మాధవాచారి ఉన్నారు. విద్యార్థులు ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, హెచ్ఎం విఠల్ అన్నారు. చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు పంపించి, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడొద్దని ఎంపీపీ స్వరూప సూచించారు. వెల్దుర్తి మండలంలోని మానేపల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు సర్పంచ్ వెంకటలక్ష్మి, ఎంఈవో యా దగిరి, స్థానిక నాయకుడు నరేందర్రెడ్డి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విధంగా ప్రోత్సహించాలని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జూనియర్ కళాశాలలో లెక్చరర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి హెచ్ఎంలకు దరఖాస్తు ఫారాలను ప్రభుత్వ కళాశాల లెక్చరర్లు అందజేశారు.