
ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
జహీరాబాద్, ఆగస్టు 26 : పేదలు తమ ఆడపిల్లల పెండ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు తెలిపారు. గురువారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్, ఇజ్రాయిల్ బాబీ ఉన్నారు.
జహీరాబాద్ అభివృద్ధికి గార్డెన్ దొర ఎంతో కృషి
జహీరాబాద్, ఆగస్టు 26 : గార్డెస్ దొర జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. గురువారం జహీరాబాద్ మెథడిస్టు చర్చి అవరణలో ఉన్న గార్డెన్ దొర 29వ వర్థంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన చేసేందుకు పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో గార్డెన్ దొర ఎన్నో కార్యక్రమాలు చేసి పేదలను చైతన్యం చేశారని గుర్తు చేశారు. గార్డెన్ దొర వర్థంతి సందర్భంగా మెథడిస్టు చర్చి ఆవరణలో ఆటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆటల పోటీలను ప్రారంభించి యువకులు చదువుతో పాటు ఆటలో ముందుకు పోవాలని కోరారు. కార్యక్రమంలో మెథడిస్టు చర్చి నిర్వాహకులు పాల్గొన్నారు.