
హుస్నాబాద్టౌన్, జూన్ 27: జూలై 1వ తేదీనుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని హు స్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని 20వ వార్డు కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిద్వారా మన పట్టణాన్ని మంచి పట్టణంగా తీర్చిదిద్దుకునే అవకాశం లభించిందన్నారు. వార్డుల వారీగా నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడంతోపాటు వార్డు పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి దోహదపడుతుందన్నారు. ప్రతి వార్డులో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, ఇందుకు వార్డు కమిటీలు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వాల సుప్రజనవీన్రావు, మాజీఎంపీపీ ఆకుల వెంకన్న, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అయిలేని శంకర్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్, వార్డు అధికారి కొరెపు రవితోపాటు పలువురు వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.