
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 16: టీఎస్‌బీపాస్‌తో అనుమతులు పొందిన ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని.. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఎస్ బీపాస్ నిబంధనల ప్రకారం సరైన పత్రాలను సమర్పించి ఇండ్ల అనుమతులు పొందాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమతులు పొందిన ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని లేనిచో చర్యలతో పాటు కూల్చివేస్తామన్నారు. భూమి విలువలో 25 శాతం జరిమానా విధిస్తామన్నారు. అనుమతులకు విరుద్ధ్ద్దగా నిర్మాణాలు చేపట్టిన 16 భవనాలను గుర్తిచామని వాటిలో నాలుగు భవనాలు కూల్చి వేశామన్నారు. భవన నిర్మాణాలు చేపట్టే వారు టీఎస్‌బీపాస్ ద్వారా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. పట్టణంలో లే అవుట్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనుమతులు లేని వెంచర్లలోఎవరు ప్లాట్లు కొనుగోలు చేయరాదన్నారు.
పట్టణంలో ‘భువన్’ సర్వే ప్రారంభమైన్నది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్‌లో పొందుపరిచేందుకు క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ ఆప్‌లోడ్ బాధ్యతలను మున్సిపల్ బిల్ కలెక్టర్లకు అప్పగించారు. రెండు రోజులుగా పట్టణంలో5 టీమ్‌లతో సర్వే చేపట్టారు. ఇంటి కొలతలు సరిచూసి భువన్ యా ప్లో పొందుపరుస్తున్నారు. ఇస్రో, సీ డీఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాప్ రూపొందించారు. అసెస్మెంట్లను మ్యాపింగ్ చేసి ఆదాయం సుకూర్చునేలా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ గత నెల 24న కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి సర్వే చేస్తున్నారు.