
రేగోడ్, మే 12: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపసర్పంచ్ కృష్ణ తెలిపారు. సిందోల్ గ్రామంలో బుధవారం ముస్లింలకు రంజాన్ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు నాగయ్యస్వామి, నాయకులు లక్ష్మారెడ్డి, తుకారాం పాల్గొన్నారు.
సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీపీ సిద్ధిరాములు
ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. బుధవారం ఆయన మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్‌తో కలిసి మండలంలోని నస్కల్, రాంపూర్ గ్రామాల్లో రంజాన్ కానుకలను ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, గ్రామస్తులు ఉన్నారు.
రంజాన్ కానుకల పంపిణీ
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు మండలంలోని అల్లాదుర్గం, చిల్వేర, చేవెళ్ల, బహిరన్‌దిబ్బ గ్రామాల్లో రంజాన్ కానుకలను టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్, నాయకులు నర్సింహులు, ప్రభు, నర్సప్ప, రవి ఉన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి..
అన్ని వర్గాల సంక్షేమంతోపాటు అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు సతీశ్‌రావు అన్నారు. మండలంలోని సర్దన గ్రామంలో ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్యవర్ధన్‌రావు, కిషన్, శ్రీనివాస్‌చారి, భిక్షపతి పాల్గొన్నారు.
ఆనందంగా పండుగను నిర్వహించుకోవాలి
రంజాన్ పండుగను ముస్లింలు ఆనం దంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆదేశాలతో మండలకేంద్రం టేక్మాల్‌తో ఎలకుర్తి, కాదులూర్, పల్వంచ, కుసంగి గ్రామాల్లో ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీబాయి, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరప్ప, ప్రధానకార్యదర్శి అవినాశ్, నాయకులు శ్రీధరచారి, సిద్ధ్దయ్య, భాస్కర్, సలీం, సత్యం, రహమత్, విఠల్‌రావు ఉన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి..
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కొల్చారం సర్పంచ్ ఉమారాజాగౌడ్ అన్నారు. కొల్చా రం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాలను ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ముస్లింలు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ రంజాన్ పర్వదినాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత వడ్ల ప్రభాకర్, మైనార్టీ నేత, వార్డు సభ్యుడు మహ్మద్, ముస్లింలు పాల్గొన్నారు.
శీలాంపల్లిలో రంజాన్ కానుకల అందజేత
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని సర్పంచ్ కవితాముకుందరెడ్డి అన్నారు. మండలంలోని శీలాంపల్లిలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకలు అందజేశారు.