మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 30 : మెదక్ పట్టణ ప్రజల భవిష్యత్ అసవరాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. వచ్చే 30 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని మెదక్ పట్టణ విస్తరణ- అభివృద్ధిపై బృహత్తర ప్రణాళిక రూపకల్పనపై శుక్రవారం వైస్రాయ్ గార్టెన్‌లో మున్సిపల్ పాలకవర్గం, ప్రజాప్ర తినిధులు, మేధావులు, పట్టణ ప్రముఖులతో అవగాహన స మావేశం ఏర్పాటు చేశారు. ఉపగ్రహ చిత్రాలతో రూపొందించిన పట్టణ మాస్టర్ ప్లాన్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. సమావేశానికి దేవేందర్రెడ్డితోపాటు మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నర్సింహరెడ్డి, నీటిపారుదల, ఆర్అండ్బీ అధికారులు, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సిద్ధ్దం చేయడానికి సం బంధింత ప్రభుత్వ విభాగాల అధికారులు, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2018లో ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ పరిధిలోని రహదారులు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పరిశ్రమ లు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు.
30 ఏండ్లకు కార్యాచరణ : రీజినల్ డైరెక్టర్ నర్సింహరెడ్డి
పట్టణాల అభివృద్ధికి మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నదని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నర్సింహరెడ్డి అన్నారు. పాత ప్ర ణాళికలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో కోత్త ప్రణాళికలు అవసరమన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 2018లో మాస్టర్ ప్లాన్ ప్రారంభించినట్లు తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడడంతోపాటు మూడు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమవడంతో పట్టణ జనాభా పెరిగిందన్నారు. ఈ నేపథ్యం లో రానున్న 30 ఏండ్లకు పట్టణంలో లక్ష జనాబాకు తగినట్లుగా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), ప్రైవేట్ కన్సల్టెన్సీలతో కలిసి ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ ప్రణాళికలు రాబోయే 30 ఏండ్లకు పట్టణంలో మెరుగైన సౌకర్యాలు కల్పనకు దోహదం చేస్తాయన్నారు. ప్రణాళిక తయారీలో నివాస ప్రాం తాలు, వాణిజ్య, వ్యాపారం, రవాణా, ఇండస్ట్రీయల్ జోన్, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పర్యావరణం, రహదారుల విస్తరణ, బఫర్ జోన్లను గుర్తించడం, పట్టణానికి రింగురోడ్డు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు.
మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో భవిష్యత్‌లో ఎలాంటి మార్పులు చేయాలి? అన్నది చర్చించా మన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బృహత్తర ప్రణాళికలు రూపొందించామన్నారు. మెదక్ మున్సిపాలిటీ 1953లో ఏర్పాటైందని, ప్రస్తుతం పట్టణంలో 2011 లెక్కల ప్రకారం 54,347 జనాభా ఉండగా.. ప్రస్తుతం 70వేలకు పైగా ఉందన్నారు. పట్ణణానికి ప్రతిరోజూ 10 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారన్నారు. 2041 వరకు లక్ష జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఏవైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే మూడు నెలల సమ యంలో తెలియజేయాలని నర్సింహరెడ్డి సూచించారు.
సౌకర్యాలు పెంచాలి : మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్అభివృద్ధికి మాస్టర్ ప్లాన్మెదక్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్నది.. వివిధ ప్రాం తాలు నుంచి వలసలు పెరగడంతో జనాభా పెరుగుతుందని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. భవిష్యత్‌లో ప్రజల అవసరాల మేరకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలన్నారు. 2011 జనాభా ప్రతిపాదిక తీసుకుని 2041 వరకు పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌పై అందరి ఆభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
మాస్టర్ ప్లాన్‌తో మహర్దశ : వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్
మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్‌తో మహర్దశ పట్టనుందని వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. వచ్చే 20 ఏండ్లలో అ వసరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, లక్ష్మీనారాయణగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు గంగాధర్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ మధుసూదన్‌రావు ప్రణాళికపై పలు సూచనలు, సలహాలు చేశారు. సమావేశం లో మాజీ వైస్‌చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు వసంత్, కిశోర్, శేఖర్, శ్రీనివాస్, రాజలింగం, సమీయొద్దీన్, జయరాజ్, సుంకయ్య, నాయకులు లింగారెడ్డి, చింతల నర్సింహు లు, శ్రీధర్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, దుర్గాప్రసాద్, అరవింద్‌గౌడ్, మధు, బొద్దుల కృష్ణ, రాములు, అమ్జద్ పాల్గొన్నారు.