నర్సాపూర్/ రామాయంపేట/ కొల్చారం, ఆగస్టు 11 : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపటిన ‘మనఊరు- మనబడి’ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులతోపా టు ప్రజాప్రతినిధులను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆదేశించారు. నర్సాపూర్ మండలంలోని కాగజ్మద్దూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈవో బుచ్చానాయక్తో కలిసి డీఈవో సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న ‘మనఊరు-మనబడి’ పనులను పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచనలు, సలహాలు ఇచ్చారు. మారడి బయో ఇండస్ట్రీ ఆర్థికసాయంతో అదనపు తరగతి గది నిర్మా ణంపై డీఈవో అభినందించారు. ఈ సందర్బంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ నెల 14న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాఠశాల పునఃప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అనంతరం ఉపా ధ్యాయుల విద్యాబోధనను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని అనుసరిస్తూ పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, మారడి కంపెనీ ప్రతినిధి ప్రీతంరెడ్డి ఉన్నారు.
పాఠశాలలు శుభ్రంగా ఉండాలి : చైర్మన్ జితేందర్‌గౌడ్
రామాయంపేట మున్సిపల్లోని ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని లేకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. మున్సిపల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. పారిశుధ్య కార్మికులతో పాఠశాలల్లో స్వచ్ఛత పనులు చేయించారు. చైర్మన్ జితేందర్‌గౌడ్ ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. పాఠశాలలు శుభ్రంగా ఉంటూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉం డాలని సూచించారు. మున్సిపల్లోని గొల్పర్తి, కోమటిపల్లి, రామాయంపేట బాలికల పాఠశాలలను సందర్శించారు. చైర్మన్ వెంట వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కమిషనర్ ఉమాదేవి, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, అనిల్, దేవుని జయ, మల్యాల కవిత, చిలుక గంగాధర్, సుందర్‌సింగ్, నాయకులు చంద్రపు కొండల్‌రెడ్డి, కిషన్, దేవుని రాజు, శ్యాంసుందర్, సిబ్బంది ఉన్నారు.
బాలల హక్కులపై అవగాహన
కొల్చారం మండలంలోని 5 -18 సంవత్సరాల పిల్లలందరూ బడిలోనే ఉండాలి, బాలల హక్కులను కాపాడాలని ఎంపీపీ మంజులాకాశీనాథ్, కైలాస్ ఫౌండేషన్ ప్రతినిధి సత్యనారాయణ అన్నారు. ఎనగండ్ల గ్రామంలోవిద్యార్థులు, తల్లిదండ్రులకు బాలల హక్కులు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. కైలాస్ ఫౌండేషన్ ప్రతినిధి సత్యనారాయణ మా ట్లాడుతూ.. పిల్లలను బాగా చదివించాలని, వారు చదువుకో వడానికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్నారు. మగ, ఆడ అనే తేడా లేకుండా పిల్లలందరినీ చదివించాలని సూచిం చారు. కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు బాల్య వివాహాలు- నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గణేశ్, ఏఎస్సై వాణి, పోలీస్ సిబ్బంది, కైలాస్ సంస్థ ప్రతినిధి దయాశీల పాల్గొన్నారు.