కొల్చారం, అక్టోబర్ 25 : కొల్చారం- కౌడిపల్లి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వాసి మృతి చెందాడు. కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..పటాన్‌చెరుకు చెందిన సలీం(25)తో పాటు మరో నలుగురు మూడు బైక్‌లపై జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయల్లో స్నేహితుని దావత్ కోసం బయలు దేరారు.
సలీం, సమీర్ ఉన్న బైక్ కొల్చారం- కౌడిపల్లి మధ్య అటవీ ప్రాంతం లోతువాగు సమీపంలో రోడ్డు సైడుకు ఉన్న అల్యూమినియంతో ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్వాల్ను అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. దీంతో దీంతో బైక్ నడుపుతున్న సలీం అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుకాల కూర్చున్న సమీర్‌కు గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పొలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సమీర్‌ను దవాఖానకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.