దుబ్బాక, జనవరి 24: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెం దిన మామిడాల రాజు అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాకపోవడంతో సెల్‌టవర్ ఎక్కాడు. గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారులను ప్రశ్నించాడు. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
శుక్రవారం దుబ్బాకకు వచ్చిన రాజు సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్‌పై నుంచి గ్రామస్తులకు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో టవర్ వద్దకు వచ్చిన గ్రామ పెద్ద లు, పోలీసులు నచ్చజెప్పినా వినకలేదు. మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్ వచ్చి హామీ ఇవ్వడం తో సెల్‌టవర్‌ను దిగాడు. రాజు తన తల్లిదండ్రుల కు చెందిన ఇంట్లో భార్య, కుమారుడితో కలిసి ఉం టున్నాడు. మున్సిపల్ అధికారులు వారింటికి వెళ్లి ఇందిరమ్మ ఇంటి కోసం మరోసారి అతడి నుంచి దరఖాస్తు స్వీకరించారు.
కంది, జనవరి 24 : ఇల్లు లేని తనకు ఇందిరమ్మ ఇంటికి అర్హుడిగా గుర్తించాలంటూ సెల్‌టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. శుక్రవారం కందిలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్ల్లు, రేషన్‌కా ర్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న అర్హుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. గ్రామసభ కొన సాగుతుండగానే కందిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెం దిన ఎండీ మహ్మద్ అనే వ్యక్తి సభా ప్రాంగణంలో ఉన్న సెల్‌టవర్ ఎక్కే ప్రయత్నం చేశాడు. కొద్ది దూరం ఎక్కగానే గమనించిన పోలీసులు, అక్కడే ఉన్న గ్రామస్తులు మహ్మద్‌ను పట్టుకొని కిందకు దింపారు. తనకు ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, లేకుంటే టవర్ ఎక్కి దూకి చస్తానంటూ బెదించాడు.