తూప్రాన్, జూన్ 7: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో తాళం వేసిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు భారీ దొంగతనం చేశారు. వివరాల్లోకి వెళ్తే..తూప్రాన్ పట్టణానికి చెందిన చంద్రమౌళి విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం తిరుపతికి వెళ్లారు.
తిరుపతి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి చూడగానే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, వెండి, రూ.1.50 లక్షల నగదు దొంగతనం చేశారు. బాధితుడు చంద్రమౌళి ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.