నిజాంపేట,ఏప్రిల్11 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాఫూలే అని తహసీల్దార్ రమ్యశ్రీ అన్నారు. నిజాంపేట తహసీల్దార్ కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ రమ్యశ్రీ శుక్రవారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..స్త్రీ విద్య, సమాజిక న్యాయం కోసం ఫూలే దంపతులు ఎంతో కృషి చేశారన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఏవో సోమలింగారెడ్డి, ఆర్ఐ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేశ్, మాజీ ఉపసర్పంచ్ బాబు, మండల కో-అప్షన్ మాజీ సభ్యుడు గౌస్, తదితరులు ఉన్నారు.