Medak | అక్రమంగా పశువుల రవాణా.. మూడు లారీలను పోలీసులకు అప్పగించిన స్థానికులు
నర్సాపూర్ పట్టణంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు లారీలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు లారీలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ నుంచి సంగారెడ్డి వైపు లారీల్లో గోవులు, లేగ దూడలను అనుమానాస్పదంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో హిందూ సంఘాల నాయకులు అప్రమత్తమయ్యారు. హిందూ వాహిని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ప్రతినిధులు కలిసి పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద వాహనాలను అడ్డగించారు.
వాహనాలను తనిఖీ చేయగా లారీల్లో పెద్ద సంఖ్యలో గోవులు, దూడలు గుజ్జుగా నింపి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలించి పరిశీలన చేపట్టారు. అనంతరం పశువులను రక్షించి బీరంగూడ గోశాలకు తరలించినట్లు తెలిసింది. మూడు వాహనాల్లో కలిపి వందకు పైగా గోవులు, లేగ దూడలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే పశువులను అమానుషంగా ఒకదానిపై ఒకటి నింపి తరలించడం వల్ల కొన్ని దూడలు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

