మహిళలకు కోర్టుల అండ
మహిళా సాధికారతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ పనిచేస్తున్నదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు.
- మహిళా సాధికారతే న్యాయవ్యవస్థ ధ్యేయం
- జిల్లా న్యాయసేవాధికార చైర్మన్ లక్ష్మీశారద
- జిల్లావ్యాప్తంగా బాలికల దినోత్సవం
- విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు
మెదక్ అర్బన్/ శివ్వంపేట/ చిలిపిచెడ్, జనవరి 24 : మహిళా సాధికారతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ పనిచేస్తున్నదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. మంగళవారం జాతీ య బాలికల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. మహిళలకు కోర్టులు అండగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. బాలికలను ప్రోత్సహి స్తే మరింత ఉన్నత స్థానాలకు ఎదుగుతారని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చేసే పనులు, సేవలు, భా ద్యతలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి జితేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫజల్ ఆహ్మద్, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలయ్య, న్యాయవాది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
వేధింపులపై మౌనం వీడాలి : సీడీపీవో హేమభార్గవి
శివ్వంపేట మండల పరిధిలోని గూడూరు కస్తూర్బా బా లికల పాఠశాలలో బాలికల దినోత్సవం నిర్వహించారు. బా లికలు సమాజంలో ఎదుర్కొంటున్న వేధింపులపై మౌనం వీడాలని నర్సాపూర్ ప్రాజెక్టు సీడీపీవో హేమభార్గవి పిలుపు నిచ్చారు. కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీడీపీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినులు బాల్యవివాహాలను చేసుకోవద్దని, ఉన్నత చదువులు చదివి ప్రతిభను చాటాలన్నారు. అనంతరం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై విద్యార్థి నులు డ్రామా, డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంతోష, వసుమతి, హెచ్ఎం మంజూల, ఉపాధ్యాయులు ఉన్నారు.
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ కస్తూర్బా పాఠశాల లో బాలికల దినోత్సవం నిర్వహించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని హెచ్ఎం ఉమమహేశ్వరి అన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

