డ్రాగన్ సాగు ఆదాయం బాగు
నోరూరించే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. రైతులకు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. థాయిలాండ్‌కు చెందిన ఈ పండ్లు ఒకప్పుడు కలకత్తా, ముంబాయి లాంటి నగరాల్లో పరిమితమయ్యేవి. ఇప్పుడు తెలంగాణలో కూడా లభిస్తున్నాయి.
- సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు
- ఒకసారి మొక్క నాటితే 25 ఏండ్లు దిగుబడి
- కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సొంతూరులో వ్యవసాయం
- రాయపోల్ మండలం వడ్డేపల్లి యువ రైతు వినయ్‌రెడ్డి
- నేలలన్నీ అనుకూలం, తక్కువ నీటితో వినియోగం
- పది ఎకరాల్లో సాగు చేస్తున్న యువ రైతు
- ఎకరాకు రూ.10లక్షల ఆదాయం
రాయపోల్, అక్టోబర్ 21 : నోరూరించే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. రైతులకు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. థాయిలాండ్‌కు చెందిన ఈ పండ్లు ఒకప్పుడు కలకత్తా, ముంబాయి లాంటి నగరాల్లో పరిమితమయ్యేవి. ఇప్పుడు తెలంగాణలో కూడా లభిస్తున్నాయి. రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తుడండంతో కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఇండియాకు వచ్చి తనకున్న పదెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. తక్కునీటితోపాటు డ్రిప్ ద్వారా మొక్కలు నాటాడు. ఆర్గానిక్స్ ఎరువులతో ఎకరాకు 500 సిమెంట్ పోల్స్ ఏర్పాటు ఒక్కో పోల్‌కు నాలుగు మొక్కలు నాటి సాగుచేస్తున్నాడు. రూ.120తో ఒక్కొక్క మొక్కను కొనుగోలు చేసి మొదట ఎకరంన్నరలో సాగు చేశాడు. ప్రస్తుతం ఆరెకరాల్లో సాగుచేస్తున్నాడు. ఎకరాకు రూ.5లక్షల లాభం వస్తున్నదని, విదేశాలకు వెళ్లి కష్టపడడం కంటే ఉన్న దాంట్లో ఆధునిక వ్యవసాయ పంటలు సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తున్నాయని యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వినయ్‌రెడ్డి చెబుతున్నాడు.
రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చిదు వినయ్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడే కొన్నేండ్ల తర్వాత డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం, పెట్టుబడి ఖర్చు, వచ్చే ఆదాయం లాంటి అంశాలపై అధ్యయనం చేశాడు. తన వ్యవసాయ భూమిలో సొంతంగా పెట్టుబడి పెట్టాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పదెకరాల్లో సాగుకు శ్రీకారం చూట్టారు. ఇందుకోసం 3అడుగుల ఎత్తు ఉన్న సిమెంట్ స్తంభాలు, రెండు అడుగుల లోతులో మొక్కలు నాటాడు. ఆరడుగుల ఎత్తులో ఒక్కో స్తంభం చుట్టు నాలుగు మొక్కలు నాటాడు. ప్రతి ఎకరానికి 500 స్తంభాలు పాతి ఎకరానికి రెండు వేల మొక్కల చొప్పున పది ఎకరాల్లో 20వేల మొక్కలు నాటాడు. 25 ఏండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి. ఈ మొక్కలకు 15 రోజులకోసారి నీటిని అందిస్తున్నారు. నెలకోసారి పశువుల పేడ, వానపాములుతో తయారైన ఎరువులను వేశారు. పంటకు సోకే లద్దె పురుగు నివారణకు వేపాకులతో తయారైన నూనెను పిచికారీ చేశాడు. భారీ దిగుబడి రావడంతో డ్రాగన్ పండ్లను హైదరాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్‌కు తరలించారు. కిలో రూ.300 నుంచి 400 వరకు విక్రయించాడు. గతేడాది ఎకరాకు రూ.5లక్షల లభాలు రాగా, ఈ ఏడాది రూ.10లక్షలకు వరకు రానున్నదని యువ రైతు తెలిపాడు.

25 ఏండ్ల వరకు ఆదాయం
మొక్క ఒకసారి నాటితే 25ఏండ్ల వరకు అధిక దిగుబడి వస్తుంది. నేలరకాల బట్టి మొక్కకు నీరందించాలి. నీరు అధికంగా ఉన్న పరిస్థితులో తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి యేడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.5లక్షల పెట్టుబడి రాగా. రూ. 10 లక్షల వరకు ఆదాయం ఉంటుంది.
ఔషధ గుణాలు మెండు..
డ్రాగన్ ఫ్రూట్ పండును జ్యూస్, జామ్ వివిధ రకాల పానీయాల్లో వినియోగిస్తారు. ముఖ్యంగా వీటిని తినడం ద్వారా క్యాన్సర్, బీపీ, కోలెస్ట్రా వంటి సమస్యలు దరిచేరవు. హిమోగ్లోబిన్ వృద్ధితో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది. తక్కవ నీటితో ఔషధ గుణాలు ఉన్న పండ్ల తోటలను సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడులు వస్తున్నాయి.
అన్ని నేలలు అనుకూలం
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అన్నిరకాల నేలలు అనుకూలం. ఈ పంటకు నీళ్లు అవసరం చాలా తక్కువ. పూత, కాత సమయంలో మాత్రమే ఐదురోజులకోసారి నీటి తడిని అందిస్తే చాలు. ఎకరాల్లో 2వేల మొక్కలు నాటుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి వాటి చుట్టు మొక్కలను నాటి కిందికి జారకుండా స్తంభాలపై రౌండ్ సిమెంట్ రింగ్‌లను ఏర్పాటు చేస్తే మొక్కలు ఏపుగా పెరిగి రైతులు అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుతో అధిక ఆదాయం..
డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుతో రైతులకు అధిక ఆదా యం వస్తుంది. కెనడాలో ఉన్నప్పటికీ సొంత ఊరులో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుచేయాలని నిర్ణయించుకున్నా. మొదటగా ఎకరాన్నరలో మొక్కలు నాటగా, ప్రస్తుతం ఆరెకరాల్లో మొక్కలు నాటి సాగుచేస్తున్నా. రూ.5లక్షల వరకు పెట్టుబడి అయింది. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కిలోకు రూ.300 నుంచి రూ.400వరకు పలికింది. ఎకరానికి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పండు రూ.130 వరకు విక్రయించాం. పూర్తిగా ఆర్గానిక్స్ ఎరువుల ద్వారా పంట సాగు చేశా. హైదరాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్‌కు తరలిస్తున్నాం. డ్రాగన్ పం టలో అంతరు పంటను సాగుచేయడంతో రైతులకు రెండు విధాలుగా లాభాలు వస్తున్నాయి. మొక్క లు అవసరం ఉంటే రూ.120 మొక్కను అందిస్తా.
– వినయ్‌రెడ్డి, యువరైతు, వడ్డేపల్లి గ్రామం, రాయపోల్ మండలం
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

