జగదేవపూర్, సెప్టెంబర్5: ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ (90) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందింది. వజ్రమ్మ అంత్యక్రియలు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని దౌలాపూర్‌లో నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు దుబ్బాక, హుజురాబాద్ ఎమ్మెల్యేలు కొత్తప్రభాకర్‌రెడ్డి, పాడికౌశిక్రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి దౌలాపూర్ గ్రామంలోని వారి స్వగృహానికి చేరుకొని వజ్రమ్మ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. వంటేరు అన్నదమ్ములు వంటేరు సంజీవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, వంటేరు శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వజ్రమ్మ అంత్యక్రియలకు నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు.
డీసీసీబీ చైర్మన్ చిట్టిదేవేందర్‌రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ మాసీ చైర్మన్ మాదాసుశ్రీనివాస్,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గుండారంగారెడ్డి, కొండపోచమ్మ దేవాలయ మాజీ చైర్మన్లు ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి,నాయకులు సుధాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, మర్కుక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, బీజేపీ జగదేవపూర్ మండల అధ్యక్షుడు అయిలయ్య యాదవ్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వెంకట్‌రెడ్డి, ఇటికాయ చంద్రశేఖర్, మెరుగుమ హహేశ్ పాల్గొన్నారు.