సిద్దిపేట, మే 21: చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేదర్ సరిల్ వద్ద పెట్రో, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నల్ల జెండాలతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రో, డీజిల్ ధరల పెంపును వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చమురు ధరల పెంపు సామాన్యులపై పెనుభారంగా మారిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్‌పై రూ.4.60 పెంచడం తగదన్నారు. గ్యాస్ ధరలు పెంచడం వల్ల చిన్న వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల సాయిరామ్, పూజల వెంకటేశ్వరరావు, మణిక్యరెడ్డి, గుండు భూపేశ్, మెహన్‌లాల్, పోచబోయిన శ్రీహరి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనుకరాజు, మేర్గు మహేశ్, బర్ల మల్లికార్జున్, మల్లికార్జున్, రాజు, పోన్నమల్ల రాములు, అరవింద్‌రెడ్డి, లక్ష్మణ్, సాయన్నగారి సుందర్, ముత్యాల కనకయ్య, నాగరాజురెడ్డి, కాముని నగేశ్, ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, సాయిప్రేమ్, అయిలయ్య, మెయిజ్ తదితరులు పాల్గొన్నారు.