తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు. స్వరాష్ట్రం సాధించిన ఉద్యమకారుడు, సాధించిన తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన పరిపాలనా దక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు.
తెలంగాణ హక్కులకోసం తెగించి కోట్లాడే పోరాట యోధుడు కేసీఆర్ పది కాలాల పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ప్రజలకు సేవ చేయాలని భగవంతున్ని వేడుకున్నారు. మండలల్లోని దవాఖానల్లో పండ్లు పంపిణీ చేశారు. అందోల్, నారాయణఖేడ్లలోని మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో కలిసి కక్ కట్ చేసి సంబురాలు చేశారు.
– సంగారెడ్డి, న్యూస్ నెట్వర్క్, ఫిబ్రవరి17