చేర్యాల, ఏప్రిల్ 27 :ఎల్కతుర్తిలో ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన అధినేత కేసీఆర్ తిరుగు ప్రయాణంలో రాత్రి రోడ్డు మార్గంలో బస్సులో ప్రయాణించారు. రాత్రి జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండల కేంద్రం మీదుగా నర్మెట్ట, మద్దూరు మండలంలోని లద్నూరు, మద్దూరు నుంచి చేర్యాల మండలంలోని ముస్త్యాల, చేర్యాల పట్టణం మీదుగా వేచరేణి, కొమురవెల్లి నుంచి ఐనాపూర్, పోసాన్పల్లి మీదుగా రాత్రి పొద్దుపోయిన తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.
ఆయా గ్రామాల్లో మంగళహారతులతో కేసీఆర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. కేసీఆర్ బస్సులో నుంచి అభివాదం చేశారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఉన్నారు.