మర్కూక్, మే 3: మానవాళి మనుగడ కోసం మొక్కలు నాటడం ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని హరితసేన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు అన్నారు. శనివారం మర్కూక్ మండలంలోని అంగడికిష్టాపూర్‌లో గ్రీన్ చాలెంజ్ -హరితసేనలో భాగంగా దుర్గామాత దేవస్థానం పరిధిలో మొక్కలు నాటారు. జయన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కల్లెపు నవీన్‌రావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి,దుర్గామాత ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం చెక్కును అందచేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. పుట్టిన రోజున సంబురాలు చేసుకోవడమే కాకుండా నేటి యువత మొక్కలు నాటడం అలవర్చుకోవాలని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవడానికి మొక్కలు నాటడం అవసరం అన్నారు. ఈ అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హరితసేన కోఆర్డినేటర్ గర్నేపల్లి సతీశ్, అనిల్ మొగిలి, సర్పంచ్ రాములుగౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.