ప్రశాంత్‌నగర్, అక్టోబర్ 20: ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద మొక్కలు.. రోడ్డుకిరువైపులా తోరణంలా అల్లుకున్న పచ్చని చెట్లు.. ఎటుచూసినా పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్నది సిద్దిపేట పట్ణంలోని 11వ వార్డు కాళ్లకుంట కాలనీ. ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట పట్టణం హరితమయంగా రూపుదిద్దుకున్నది. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ రవీందర్‌రెడ్డి సూచన మేరకు 11వ వార్డు కౌన్సిలర్ దాసరి భాగ్యలక్ష్మీశ్రీనివాస్యాదవ్ నేతృత్వంలో కాళ్లకుంట కాలనీలో పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పచ్చదనమే లక్ష్యంగా సమష్టి కృషితో కాలనీలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం ఉద్యమంగా చేపట్టారు. దీంతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణంతో ఈ కాలనీ అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నది. హరితహారం ఫలితాలు ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అందరి సహకారంతో పచ్చదనం..
కాలనీలో సమష్టి కృషితో మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపడుతున్నాం. ఈ మధ్యనే రెండు వేల మొక్కలు నాటాం. నాటిన అన్ని మొక్కలను ప్రత్యేక శ్రద్ధ్దతో సంరక్షిస్తున్నాం. ముఖ్యంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో హరితహారం కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నాం. మా కాలనీలో పచ్చదనాన్ని చూసి అందరూ
ముగ్ధులవుతున్నారు.
– దాసరి భాగ్యలక్ష్మీశ్రీనివాస్యాదవ్, 11వ వార్డు కౌన్సిలర్ సిద్దిపే