కొల్చారం, జనవరి 11 : క్రీడారంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం పెం పొందుతుందని మెదక్ డీఎస్పీ సైదులు, కొల్చారం జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కొల్చారం జిల్లా పరిషత్ ఆవరణలో యువజన వారోత్సవాలు పురస్కరించుకుని మం డలస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వామి వివేకానందుని మాటలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సెల్‌ఫోన్ వచ్చాక శారీరక శ్రమ తగ్గిపోయి, ఫోన్ల్లో గేమ్‌లు ఆడుతున్నారన్నారు. యువ త భేదాభిప్రాయాలు లేకుండా క్రీడల్లో బాగా రాణించాలన్నారు. కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ ఉమ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంఈవో నీలకంఠం, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్‌కుమార్, కాళీనాథ్, పీఈటీ శ్రీనివాస్‌రావు, ఏఎస్సై తారాసింగ్, పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రం పాపన్నపేటలో రెండు రోజులపాటు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాపన్నపేట జట్టు విజేతగా నిలిచింది. ఎస్సై విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా, 22 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతి పాపన్నపేట జట్టు గెలుచుకోగా, రెండో స్థానం రాజ్యాతండా జట్టు చేజిక్కించుకుంది. కార్యక్రమంలో పాపన్నపేట జడ్పీస్కూల్ హెచ్ఎం హరిసింగ్, నోడల్ అధికారి అంజాగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు మనోహర్, వినోద్ ప్రభాకర్, ప్రసాద్, మధు, రవి, చంద్రమోహన్తోపాటు పోలీసు సిబ్బంది వీరప్ప, బస్వరాజ్, దుర్గాప్రసాద్, రాజు వెంకటేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
మండలకేంద్రం టేక్మాల్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో మండలస్థాయి వాలీబాల్ పో టీలు నిర్వహించగా, 8 జట్లు పాల్గొన్నాయి. కుసంగి గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానంలో, ఆదర్శ పాఠశాల విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. విజేత జట్లకు ఏఎస్సై తుక్క య్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరప్ప, స్థానిక నేత భాస్కర్ పాల్గొన్నారు.
సంక్రాంతి పురస్కరించుకోని జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేత విద్యార్థినులకు కళాశాల ప్రిన్సిపాల్ వాసంతి పిైళ్లె బహుమతులు అందజేశారు.
సరస్వతీ శిశుమందిర్‌లో మహిళలకు ముగ్గులు, విద్యార్థులకు గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించారు. విజేతలకు సరస్వతీ విద్యాపీఠం జిల్లా సభ్యురాలు సవిత బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సరస్వతీ శిశుమందిర్ పాఠశాల కమిటీ సభ్యులు అశోక్, పవన్‌కుమార్, నర్సింగరావు కులకర్ణి, ప్రధానాచార్యులు సుధారాణి పాల్గొన్నారు.