సిద్దిపేట, జూలై 11: క్రీడా ప్రాంగణాల నిర్వహణ లోపం క్రీడాకారులకు శాపంగా మారుతున్నది. గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీ యస్థాయి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం తో సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు అసోసియేషన్, అధికారుల మధ్య సమన్వయలేమి కారణంగా క్రీడాకారులకు అందుబాటులో లేకుండాపోతున్నాయి. మొన్నటి వరకు అంతర్ జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ క్రికెట్ మైదా నం నేడు నిర్వహణ లేమి కారణంగా క్రీడాకారులకు పనికి రాకుండా పోయింది. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో ఆచార్య జయశంకర్ స్టేడియం నిర్మించారు. నిన్న మొన్నటి వరకు నిత్యం క్రీడాపోటీలు, డేఅండ్‌నైట్ మ్యాచ్‌లు జరిగిన ఈ స్టేడియం నేడు ఖాళీగా దర్శనమిస్తున్నది. మైదాన నిర్వహణ బాధ్యతలను జిల్లా క్రీడల యువజన సర్వీసుల శాఖ, క్రికెట్ అసోసియేషన్ నిర్వహించేది. అధికారులు, అసోసియేషన్ మధ్య సమన్వయం లేకపోవడంతో స్టేడియం నిర్వహణ గాలికి వదిలేశారు. సిద్దిపేట స్టేడియం టర్ఫ్ టికెట్ కావడంతో దాని నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు. ఏమైందో ఏమో కానీ రెండు నెలల నుంచి స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి లేకుండా పోయింది. టర్ఫ్ పిచ్ కావడంతో దానిని నిత్యం రోలింగ్ చేయడంతో పాటు వర్షం వచ్చినప్పుడు ఆరబెడుతూ ఉండాలి. దీనికి తోడు గ్రాస్ కటింగ్ పనులు ఎప్పటికప్పుడు చేస్తుండాలి. పిచ్ రోల్ చేసేందుకు రోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ, పాడైపోవ డంతో వాటికి మరమ్మతులు చేయడం లేదు. ఈ పనులన్నీ జరగని కారణంగా స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. పిచ్‌పై గ్రాస్ పెరగడంతో మ్యాచ్‌లు ఆడడం క్రీడాకారులకు ఇబ్బందిగా తయారైంది. ఇప్పటికైనా అధికారులు పిచ్‌ను పునరుద్ధరించి క్రికెట్ మ్యాచ్‌లు జరిగేలా చూడాలని క్రీడాకారులు కోరుతున్నారు.
మా పిల్లలు ఇకడే క్రికెట్లో శిక్షణ పొందుతున్నారు. నిత్యం నేను వారిని స్టేడియానికి తీసుకువస్తాను. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులకు ప్రతి ఆదివారం మ్యాచ్ నిర్వహించేవారు. కానీ, పిచ్ సిద్ధంగా లేకపోవడంతో మ్యాచ్‌లు ఆడించడం లేదు. అధికారులు స్పందించి మైదానాన్ని సిద్ధం చేయాలి.
మా అబ్బాయిని నిత్యం కోచింగ్ కోసం ఈ స్టేడియానికి తీసుకువస్తున్న.శిక్షణ పొందిన క్రీడాకారులకు పిచ్‌పై ఆడడం ద్వారా మంచి మెలకువలను నేర్చుకునేందుకు వీలు ఏర్పడుతుంది. అనుభవం వస్తుంది. పిచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పిల్లలు మ్యాచ్‌లు ఆడేందుకు ఇబ్బందిగా మారింది.
క్రికెట్ స్టేడియంలో క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇన్ని రోజులుగా క్రికెట్ అసోసియేషన్, క్రీడలు యువజన సర్వీసుల శాఖ తరఫున స్టేడియం నిర్వహణ చూ శాం. సిబ్బందికి మా శాఖ తరఫునే వేతనాలు ఇస్తున్నాం. కోచింగ్‌కు వచ్చే పిల్లల వద్ద ఫీజులు కలెక్ట్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం.
రెండు నెలల కిందటే క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారికి స్టేడియం బాధ్యతలు అప్పగించాం. ఎనిమిదేండ్ల పాటు స్టేడియం నిర్వహ ణ బాధ్యతలను అసోసియేషన్ తరఫున చూ శాం. స్టేడియంలో ఉన్న రోలింగ్ యంత్రాలు, క్రీడా పరికరాలన్నీ అసోసియేషన్ సంబంధించినవే.