ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగు
ఆడబిడ్డలు చదువుకుం టే కుటుంబమే బాగుపడుతుందని, ఆడబిడ్డల చదువు విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు.
- అమ్మాయిల చదువుపై నిర్లక్ష్యం తగదు
- పేద విద్యార్థినులకు మలబార్ గోల్డ్ అండగా నిలవడం అభినందనీయం
- 314మంది విద్యార్థినులకు రూ. 25లక్షల స్కాలర్షిప్లు అందజేత
- ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, జనవరి 10 : ఆడబిడ్డలు చదువుకుం టే కుటుంబమే బాగుపడుతుందని, ఆడబిడ్డల చదువు విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్సీపురం డివిజన్లో ఉన్న గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చందానగర్‌కు చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కి చెం దిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతాభూపాల్‌రెడ్డి, పటాన్చెరు, వెలిమెల టీఎస్ మోడల్ స్కూల్, సంగారెడ్డి తారా కళాశాలలకు చెందిన మెరిట్ సాధించిన విద్యార్థినులు 314 మందికి రూ. 25లక్షలు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్ పుష్పానగేశ్, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థినులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మలబార్‌గోల్డ్ వారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ కళాశాలల విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ఆర్థిక సహాయం చేయ డం అభినందనీయమన్నారు. స్కా లర్షిప్లు కొందరికే కాకుండా మీరి చ్చే బడ్జెట్లోనే అందరికి వచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు.
గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావాల్సిన అన్ని సౌకర్యాలను దాతల సహకారంతో సమకూర్చుతున్నామన్నారు. విద్యార్థిని, విద్యార్థులు బాగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరుని తీసుకొచ్చి, భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మలబార్ గోల్డ్ వారు ఆడబిడ్డల చదువుకు దోహదపడటంతో పాటు వర్క్‌షాప్ ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించడం సంతోషకరమన్నారు. వీబీఆర్ కళాశాలలో 210మంది విద్యార్థినులకు స్కాలర్షిప్లు అందజేయడం సంతోషంగా ఉన్నదన్నారు. కళాశాలకు వ్యాపారవేత్తలు రాఘవరావు 51డ్యూయల్ డెస్క్‌లు, అప్పరావు సీసీ కెమెరాలు, జగదీశ్ 20టేబుల్స్, చైర్లు, సత్యనారాయణరెడ్డి 40బెంచీలు, మనదీప్రెడ్డి చైర్లు అందించారు. కార్యక్రమంలో మలబార్ చందానగర్ మేనేజర్ దీపక్, మార్కెటింగ్ మేనేజర్ అజిత్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, నర్సిం హ, పరమేశ్, బేకుయాదయ్య, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

