పటాన్చెరు, మే 25 : రుద్రారం గీతం యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. శనివారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం యునివర్సిటీలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. గీతంలోనే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో భారికెడ్లు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్అండ్బీ, ఇంజినీరింగ్ అధికారులు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులు తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి, పోలీంగ్ ఏజెంట్లకు వేర్వేరుగా మార్గాలు సిద్ధమయ్యాయని వారన్నారు.
కౌంటింగ్ వద్ద అన్ని సజావుగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గీతం యునివర్సిటీలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతను కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రం వద్ద పోలీసు భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ రికార్డులను, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను, స్ట్రాంగ్ రూమ్ కంట్రోల్ రూమ్ రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కంగ్టి తహసీల్దార్ విష్ణుసాగర్, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ రవీందర్, సర్వేయర్ కోటేశ్వర్రావు, డీఎస్పీ సత్తయ్య, సీఐ నయిముద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
పటాన్చెరు, మే 25 : పాశమైలారం యూపీఎస్ పాఠశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి తనిఖీ చేశారు. పటాన్చెరు మండ లం పాశమైలారం గ్రామంలోని అప్ప ర్ ప్రైమరీ పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శపాఠశాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఏ పీఆర్ మల్లేశ్‌ను, ఎంఈవో పీపీ రాథోడ్‌ను కలెక్టర్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో యాదగిరి, ఎంఈవో పీపీ రాథోడ్, ఏఈ పీఆర్ మల్లేశ్, కార్యదర్శి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.