మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి చిన్నారుల ఆలోచనలకు మెరుగులు దిద్దితే వారు భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఈ విషయాన్ని గుర్తించి ఇస్రో(అంతరిక్ష పరిశోధన సంస్థ) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం ది. అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2019 నుంచి యువ విజ్ఞాన్(యువిక) కార్యక్రమం రూ పొందించింది. అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రయోగాలు, పరిశోధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నది.
ఆసక్తి ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థులు దరఖాస్తును నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. www.isro.gov.in వెబ్సైట్ లో యువిక అప్లికేషన్‌ను ఈ-మెయిల్ ఐడీ తో లాగిన్ అవ్వాలి. నమోదు చేసిన 48 గం టల్లో ఇస్రో ఏర్పాటు చేసే ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. తర్వాత విద్యార్థి తన పూర్తి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. 8వ తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 15 శాతం ప్రతిభ చూ పాలి. జిల్లాస్థాయి వ్యాసరచన, ఉపన్యాస, క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 20న అర్హుల జాబితా ప్రకటిస్తారు. ఎన్సీసీ, స్కౌట్లో సభ్య త్వం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
శిక్షణ కాలంలో విద్యార్థులకు వసతి, భో జనంతోపాటు రవాణా చార్జీలు ఇస్తారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 28న మొదటి జాబి తా, ఏప్రిల్ 4న రెండో జాబితా ప్రకటిస్తారు. మే 12న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్టు చేయా లి. మే 13 నుంచి 24 వరకు శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా ప్రతిభ చాటిన 150 ఎంపికైన విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒక రికి అంతరిక్ష కేంద్రాలకు రావడానికి అవకా శం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన హైదరాబా ద్, అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం, శ్రీహరికోట కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ కేంద్రం లో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చావేదిక, ప్రయోగశాలల సందర్శన. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించి అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి యువిక శిక్షణ మంచి అవకా శం. శాస్త్రీయ అవగాహన, అంతరిక్ష పరిశోధన రంగాలపై ఈ శిక్షణ దోహదపడనుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఆయా పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
– రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి