చిలిపిచెడ్, అక్టోబర్ 16 : ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాదులోని సెర్ఫ్ ఆఫీస్ ముట్టడికి వెళుతున్న ఐకెపి వీవోఏలను మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం మండల వివోఏలు మాట్లాడుతూ ప్రతినెలా కనీసం రూ.20వేల జీతం ఇవ్వాలని.. ప్రతి గ్రామానికి సంఘానికి ట్యాబ్, నెట్వర్క్ సౌకర్యం కల్పించాలన్నారు. 58 జీవో రద్దు చేసి సెర్ఫ్ ఉద్యోగుల గుర్తించాలన్నారు.
ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, ప్రమాద బీమా కల్పించాలన్నారు. గ్రామ సంఘాల ట్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలు వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని కోరారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. బకాయి పాడిన శ్రీనిధి నిధులు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీవోఏలు వీరమణి, బాగయ్య, మాధవి, రేణుక, సరిత, లక్ష్మి, మంజుల తదితరులు ఉన్నారు.