ఆగ్రోఫారెస్ట్రీలో ఆవిష్కరణలకు పెద్దపీట
వాతావరణ మార్పుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ రంగాలను సమన్వయం చేస్తూ సుస్థిర అభివృద్ధికి ఆగ్రోఫారెస్ట్రీని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.
- సుస్థిర భవిష్యత్‌కు ఆగ్రోఫారెస్ట్రీ ఎంతో కీలకం
- ఆగ్రోఫారెస్ట్రీపై జాతీయ సదస్సులో ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్
గజ్వేల్, ఆగస్టు 18: వాతావరణ మార్పుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ రంగాలను సమన్వయం చేస్తూ సుస్థిర అభివృద్ధికి ఆగ్రోఫారెస్ట్రీని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో సిల్వికల్చర్ అండ్ ఆగ్రోఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ైక్లెమేట్ రెడీ ఆగ్రోఫారెస్ట్రీ, ఇంటిగ్రేటింగ్ ఎకాలజీ టెక్నాలజీ అండ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్నోవేషన్(ఎన్సీసీఆర్ఏఎఫ్-26) పేరిట రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ.. ఆగ్రోఫారెస్ట్రీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలంటే పర్యావరణ, సాంకేతిక ఆవిష్కరణలు అనే అంశాల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఆగ్రోఫారెస్ట్రీతో పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయాలని, అటవీ-వ్యవసాయ సమన్వయంతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆగ్రోఫారెస్ట్రీతోనే వాతావరణ మార్పులకు చెక్ పెట్టవచ్చన్నారు.
ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పరిశోధకులు సమర్పించిన 151 పరిశోధనాంశాలతో కూడిన సెక్టార్ అబ్స్రాక్ట్ వాల్యూమ్‌ను ఆవిష్కరించారు. సీఏఆర్ఈఎస్, ఎఫ్సీఆర్ఐ, నాబార్టు, సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్, సపోలా ఆర్గానిక్స్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా పరిశోధకులు, నిపుణులు, విద్యార్థులు, ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్ నోడల్ అధికారి శరవణన్, ప్రియాంక వర్గీస్, సీసీఎఫ్ క్షితిజ, నాబార్డ్ జీఎం గణపతి, అటవీ కళాశాల డీన్ ప్రవీణ, హెచ్‌వోడీ చిరంజీవరెడ్డి, రీజా సుందరం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

