నర్సాపూర్,ఏప్రిల్ 24: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా మారిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో కౌన్సిలర్ లక్ష్మీనగేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు తమ రాష్ర్టాల్లో కంటి వెలుగు అమలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు ఆంజనేయులు గౌడ్, జగదీశ్ పాల్గొన్నారు.
మనోహరాబాద్
మనోహరాబాద్, ఏప్రిల్ 24: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. మండలంలోని రంగాయిపల్లిలో సర్పంచ్ నాగభూషణంతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి పరీక్షలను నేరుగా గ్రామాల్లోనే ఉచితంగా నిర్వహించి, కండ్లద్దాలు అందజేస్తున్నదన్నారు. ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్‌లు అర్జున్, నర్సయ్య, నాగభూషణం, రేణుకా ఆంజనేయులు, ఉప సర్పంచ్ నవీన్‌చారి, ముదిరాజ్ సంఘం నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్, మైనార్టీ సెల్ మండల నాయకుడు ఇర్ఫాన్, పంజా భిక్షపతి, బాబు, వెంకటేశ్, బాలరాజు పాల్గొన్నారు. మండలంలోని గౌతోజిగూడెంలో ఏఐజీ దవాఖాన ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఏఐజీ దవాఖాన డాక్టర్ వినీత్, సిబ్బంది పాల్గొన్నారు.
చిలిపిచెడ్
చిలిపిచెడ్, ఏప్రిల్ 24: కంటి వెలుగును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మండల ప్రత్యేక అధికారి మహ్మద్ ఖాసీం తెలిపారు. సోమవారం చిలిపిచెడ్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశిప్రభ, డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు తదితరులు ఉన్నారు.
తూప్రాన్
తూప్రాన్, ఏప్రిల్ 24:అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 3వ వార్డులో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని కౌన్సిలర్ ఉమా సత్యలింగంతో కలిసి ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ అపర్ణ, కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్, శ్రీశైలంగౌడ్, 3వ వార్డు అధ్యక్షుడు డాక్టర్ సర్గల శ్రీనివాస్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, నాయకులు సత్తార్, ఆంజనేయులు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట
శివ్వంపేట, ఏప్రిల్ 24: ప్రతిఒక్కరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. మండలంలోని గంగాయిపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ శ్యామలా వెంకటేశ్‌తో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో దొంతి సర్పంచ్ ఫణిశశాంక్శర్మ, ఉపసర్పంచ్ లక్ష్మినర్సింలు, ఎంపీఓ తిరుపతిరెడ్డి, డాక్టర్ వినోద్‌కుమార్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షులు షఫియోద్దిన్ ఉన్నారు.