నర్సాపూర్, సెప్టెంబర్ 28: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తండాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.66 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలో నియోజకర్గంలోని తండాలకు బీటీ బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.80 కోట్లు వచ్చాయని, ఇప్పుడు మళ్లీ రూ.66 కోట్లతో 52 రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు.
గతంలో రూ.52 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు.అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. కుల సంఘాల భవనాలకు, అం బేద్కర్ భవనానికి స్థలాలు కేటాయించామన్నారు. మున్సిపల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేశారన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన సర్టిఫికెట్లు అందించినట్లు తెలిపారు. అన్ని హంగులతో నర్సాపూర్ పట్టణంలో హరితహోటల్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే గిరిజన తండాలకు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, బీటీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నర్సాపూర్ నియోజకవర్గానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరుతున్నానని కొందరు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జెండా కిందనే ఉంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, పార్టీని గెలుపించుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడని చెప్పారు.
లేనిపోని ఊహాగానాలను తీవ్రంగా ఖండిస్తున్నానని, కార్యకర్తలు ఆం దోళన చెందవద్దని కోరారు. నియోజకవర్గంలో ప్రతిపక్షమే లేదని మళ్లీ బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్‌గుప్తా, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హబీబ్‌ఖాన్, అశోక్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.