వెల్దుర్తి, డిసెంబర్17 : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కృషితో మండలంలో పలు అభివృద్థి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, సర్పంచ్ అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న రోడ్ల సమస్యలు త్వరలోనే తీరనున్నాయని, మండలంలో 8 రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ రూ. 8.52 కోట్లు మంజూరు చేసిందన్న్నారు. వెల్దుర్తి ప్రభుత్వ దవా ఖాన మరమ్మతులకు రూ. 29 లక్షలు, బండపోసాన్‌పల్లి, మంగళపర్తి, మండల కేంద్రం మాసాయిపేట, కొప్పులపల్లి గ్రామాల్లో ప్రభుత్వ దవాఖాన సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణాలకు రూ. 80 లక్షలు మంజూరైనట్లు వివరించారు.
‘మన ఊరు-మనబడి’లో మొదటిదశగా వెల్దుర్తి మండలంలో 12 పాఠశాలలను ఎంపిక చేసి, రూ. 4.27కోట్లు మంజూరు చేసిన ట్లు తెలిపారు. చాలా పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయన్నారు. వెల్దుర్తి, మంగళపర్తి, కుకునూర్ పాఠశాలల్లోని పేనులకు టెండర్లు పూర్తనట్ల్లు పేర్కొన్నారు. శివ్వంపేట మం డ లం దొంతి చౌరస్తా నుంచి వెల్దుర్తి మీదుగా జిల్లా కేంద్రం మెదక్ (పిల్లికొట్యాల) వర కు రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, త్వరలోనే నిధులు మంజూరవుతాయ న్నారు. వెల్దుర్తి, మాసాయిపే ట మండలాల్లో రెండు రోడ్లు మంజూరు కావాల్సి ఉందని, త్వరలో నిధులు మంజూవుతా రని పేర్కొన్నారు. మండల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సర్పంచ్‌లు శేఖర్, శంకర్‌రెడ్డి, శంకర్, మల్లేశంగౌడ్, పెంటయ్య, ఎంపీటీసీలు బాబు, లక్ష్మీ, నాయకులు నరేందర్‌రెడ్డి, కృష్ణ, పెంట్యానాయక్ ఉన్నారు.