రిజర్వాయర్లకు నీళ్లెత్తిపోయాలితక్షణమే 30 టీఎంసీల నీటిని నింపాలి
సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట కలెక్టర్, ఇరిగిషన్ అడ్వైజరీ కమిటీకి మంగళవారం లేఖ రాశారు.
- రైతులు ఎత్తిపోతల కోసం ఎదురుచూస్తున్నారు..
- రిజర్వాయర్ల దుస్థితి చూస్తే దుఃఖం వస్తోంది
- వచ్చే ఏడాది జూలై వరకు సాగు, తాగునీటికి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
- సిద్దిపేట కలెక్టర్‌కు, జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీకి లేఖ రాసిన హరీశ్‌రావు
సిద్దిపేట, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట కలెక్టర్, ఇరిగిషన్ అడ్వైజరీ కమిటీకి మంగళవారం లేఖ రాశారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌కు హరీశ్‌రావు లేఖలో పలు అంశాలు కమిటీ దృష్టికి తెచ్చారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు ఏటా ఈ సమయం వరకే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసేవారని గుర్తుచేశారు. ఈసారి ఇంకా ఎత్తిపోతలు ప్రారంభించలేదన్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరాయని, వీటిని వెంటనే నింపాలన్నారు.
కొమురవెల్ల్లి మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు అడుగంటే పరిస్థితిలో ఉన్నాయని, తక్షణమే ఈ రిజర్వాయర్లలోకి 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపాలని కోరారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి రైతులకు ప్రయోజనంగా ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 65శాతం మంది రైతులే వానకాలం పంటలు సాగుచేశారని, మిగతావారు సాగునీళ్లు లేవనే ఉద్దేశంతో భూములు బీడుగా ఉంచారని తెలిపారు.
2027 జూలై వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నదని, అప్పటి వరకు సాగు, తాగునీటికి కొరత రాకుండా ఇప్పటికిప్పుడే రిజర్వాయర్లలోకి ఎత్తిపోతలు ప్రారంభించాలని కోరారు. ఈ నీళ్ల వినియోగం పూర్తయితే మళ్లీ ఎత్తి పోయడానికి మిడ్ మానేరు రిజర్వాయర్‌లో సిద్దిపేట జిల్లాకు సరిపడా నీటిని స్టోరేజీ చేసి ఉంచాలన్నారు. యాసంగి సమయంలో అవసరానికి లిఫ్ట్ చేసుకొనేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సుమారు 6 నుండి 7 టీఎంసీల నీళ్లు తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుందని, వరి, పామాయిల్, ఇతర పంటలు సాగుచేసిన రైతులు నీటి ఎత్తిపోతల కోసమే ఎదురుచూస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. రిజర్వాయర్ల దుస్థితి చూస్తుంటే దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడే వడివడిగా నీటిని ఎత్తిపోస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఇకడి పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఏ కష్టం రాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని లేఖ ద్వారా కమిటీ దృష్టికి హరీశ్‌రావు తీసుకెళ్లారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

