మెదక్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ)/ కౌడిపల్లి: కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి మాట తప్పారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌లో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో గ్రామ దేవతల ప్రతిష్ఠలు, గ్రామ దేవతల ఆలయాల నిర్మాణాలు బాగా పెరిగాయని గుర్తుచేశారు.
పదేండ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అయ్యిందని, అందుకే గ్రామాల్లో గ్రామ దేవతలను ప్రతిష్ఠ చేస్తున్నారని గుర్తుచేశారు. పదేండ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆబ్కారీశాఖ కల్లు దుకాణాలపై దాడులు జరగలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌడకులస్తులు నడిపే కల్లు దుకాణాలపై దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. గౌడ్స్‌ను అరెస్ట్ చేసి జైలులో వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 50 ఏండ్లకే పెన్షన్ ఇచ్చారని, రూ. 5 లక్షల బీమా కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
“జనవరి 26న నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందరికీ వచ్చిం దా… మండలానికి ఒక గ్రామంలోనే రైతు భరోసా డబ్బులు వేశారు.. మిగతా గ్రామాల రైతుల పరిస్థితి ఏమిటీ.”. అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏం ఇవ్వకుండానే ఎన్నికల కోడ్‌తో తప్పించుకుందామని చూ స్తున్నాడు… రైతులు, ప్రజలు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఏం జరుగుతుందో అని ప్రజలకు సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అర్హులైన ప్రతి రైతుకు పైసలు వేశాడని గుర్తుచేశారు. ఎన్నికల నెపంతో మోసం చేసే కార్యక్రమాలు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని పథకాలు అమ లు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు సైతం ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కరోనా వచ్చినా కేసీఆర్ రైతుబంధు ఆపలేదన్నారు.
కేసీఆర్ అధికారంలోకి రాగానే రూ.200 పింఛన్‌ను రూ.2వేలు చేశారని, రైతుబంధు ఎకరాకు రూ.10వేలు, కల్యాణలక్ష్మి రూ.లక్ష, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. గీతకార్మికుల చెట్ల పన్ను, పాత బకాయిలను కేసీఆర్ రద్దు చేశారన్నారు. పండిన పంటగింజ లేకుండా కొన్నాడని, ముదిరాజ్‌లకు చేప పిల్లలు, గొల్ల కుర్మలకు గొర్రెలను పంపిణీ చేశారని, గీత కార్మికులకు వైన్స్ షాపు ల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మ న్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామగౌడ్, మాజీ జడ్పీటీసీ కవిత, ఆయాగ్రామాల నాయకులు ఎల్లం, మహిపాల్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, శంకర్‌గౌడ్, ప్రతాప్‌గౌడ్ పాల్గొన్నారు.