సిద్దిపేట, అక్టోబర్ 12: ‘మీ సమస్యను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లాం.. మిమ్మ ల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నా…ఆందోళన పడకండి.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది’.. అని జోర్డాన్‌లో చికుకున్న గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు భరోసానిచ్చారు. ఆదివారం హరీశ్‌రావు జోర్డాన్‌లో చిక్కుకున్న వారికి ఫోన్‌చేసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చికుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులు బికుబికుమంటూ బతుకుతున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. అకడే ఉండి పనిచేసుకుని బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదురొంటున్నామని కార్మికులు హరీశ్ రావుకు గోడు వెళ్లబోసుకున్నారు.ఎలాగైనా తమను తెలంగాణకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.