ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ మంత్రి హరీశ్‌రావు భరోసా కల్పిస్తున్నారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి సొంత ఖర్చుతో న్యూట్రిషిన్ కిట్ అందించి వారిలో మనోధైర్యం కల్పించేందుకు మంత్రి సంకల్పించారు. త్వరలో సిద్దిపేట నియోజకవర్గంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీబీ రోగులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. దీంతో 265 మందికి లబ్ధి చేకూరనున్నది.
సిద్దిపేట, అక్టోబర్ 17 : ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్‌రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్‌ను అందించి వారిలో మనోధైర్యాన్ని కల్పించేందుకు త్వరలో నియోజకవర్గంలోని 265 మందికి టీహెచ్ఆర్ న్యూట్రిషన్ కిట్లను నేరుగా పేషంట్లకు ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..
టీబీ పేషంట్లు రోగం వచ్చిన దాని కంటే ఎదుటి వారి అవహేళనతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాం టి వారికి అండగా నిలిచి వారిలో మనోధైర్యం నింపాడంతో పాటు వారికి మంచి పోషక ఆహారం అందించి ఆత్మీయ భరోసా కల్పించాలని మంత్రి హరీశ్‌రావు మానవతా దృక్పథంతో వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు ఆర్థిక స్థోమత లేనివారికి, టీబీ రోగులకు, 4 రకాలైన పోషకారాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను నియోజకవర్గంలోని 265 మంది రోగులకు మంత్రి హరీశ్‌రావు తన సొంత ఖర్చులతో 6నెలల పాటు న్యూట్రిషన్ కిట్‌ను అందించనున్నారు. టీబీ పేషం ట్లు చూడగానే చీదరించుకునే రోజుల్లో వారికి మనోధైర్యం అందిస్తూవారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు పౌష్టిక ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నారు.
న్యూట్రిషన్ కిట్‌లో అందించే పోషకాహారం
టీబీ పేషంట్లు వ్యాధి రాగానే కృంగి పోవడంతో పాటు చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయడం వల్ల సంపాదన కోల్పోతారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వీరికి మంచి పోషకాహారం అందించి రోగ నిరోధక శక్తి పెంచాలనే న్యూట్రిషన్ కిట్లు అందించనున్నారు. ఈ కిట్‌లో 3కిలోల బియ్యం, కిలో పప్పు, 300 గ్రాముల ఆవు నెయ్యి, 30 కోడి గుడ్లు అందించనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఈవినుత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
మనోధైర్యమే రోగానికి మందు..
టీబీ రోగులు రోజురోజుకూ ఆత్మవిశ్వాసం కోల్పోయి వారిలో వారు కుమిలి పోతారు. మనోధైర్యంతో ఎంతటి వ్యాధినైనా జయించవచ్చు. రోగుల్లో ఆత్మ విశ్వాసం కల్పిస్తే అంతకు మించిన వైద్యం మరొకటి లేదు. ఇదే విధంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో న్యూట్రిషన్ కిట్లను అందించి వారిలో మనోధైర్యం అందించాలి.
– రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు