సిద్దిపేట, జూన్ 15: సిద్దిపేటకు చెందిన తెలంగాణ సూపర్ స్పెషాలిటీ డెంటల్ దవాఖాన వైద్యుడు అరవింద్‌ను సుమన్ టీవీ అవార్డు వరించింది. దశాబ్ద కాలంగా సిద్దిపేట ప్రాం తంలో వైద్యుడిగా సేవలు అందిస్తూనే.. సామా జిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న డాక్టర్ అరవింద్‌ను ఉత్తమ వైద్యుడిగా సుమన్ టీవీ ఎంపిక చేసింది.
ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. సిద్దిపేట నుంచి సుమన్ టీవీ అవార్డు అందుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయన్ను ప్రశంసించారు. ఈ అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.