సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 2 : త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా తనను నియమించడం సంతోషకరంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళ్తూ సిద్దిపేట పట్టణంలోని బీజేపీ నాయకుడు వంగ రాంచంద్రారెడ్డిని ఆయన కలిశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. త్రిపుర చిన్న రాష్ట్రం అయినప్పటికీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. త్రిపురలో 35 శాతం గిరిజనులు ఉన్నారని, త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరం ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు. త్రిపుర రాష్ర్టానికి తన మిత్రులు రావాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు.