దుబ్బాక, మే 29 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్కు చెందిన ఏడేండ్ల చిన్నారి నిహత్ సంగీంతలో ప్రతిభ కనబరిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించినందుకు గ్రామస్తులు అభినందించారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పర్యవేక్షణలో నిర్వహించిన బృహత్తర సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన రెండు వేల మంది కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిరంతరాయంగా ఎలక్ట్రానిక్ కీబోర్డు వాయించి రికార్డు సృష్టించారు.
కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన 777 మంది చిన్నారులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. వీరిలో నిహిత్ ఉన్నారు. హల్లెల్ సంగీత పాఠశాలలో నిహిత్ కీబోర్డు వాయిద్యం నేరుకున్నాడు. శుక్రవారం గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియం లో హల్లెల్ సం గీత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్లో విద్యార్థి నిహిత్తో పాటు అతని తల్లిదండ్రులు నాగరాజు, శశిరేఖ సంగీత పాఠశాల వ్యవస్థాపకులు అగస్టీన్ దండిగి అభినందించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మెమోంటో పత్రాన్ని అందజేశారు.