
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం జీవరాశుల మనుగడకు పెనుసవాలుగా మారాయి. కొన్ని జాతులు అంతరించిపోతుండగా, మరికొన్ని జాతుల మనుగడ ప్రమాదపుటంచుల్లో ఉంది. మనిషి తన సౌకర్యం, సుఖం కోసం ఏకపక్షంగా చేస్తున్న వినాశనానికి జీవి వైవిధ్యం ఊహించని రీతిలో దెబ్బతింటున్నది. అయితే, కొద్ది కాలంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. మనదేశం, అందులోనా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఏడు విడుతల్లో నిర్వహించిన హరితహారం విజయవంతమైంది. దశల వారీగా నాటిన మొక్కలు నేడు చెట్లుగా ఎదిగి ఎటుచూసినా పచ్చదనాన్ని పంచుతున్నాయి. పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వానలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. వ్యవసాయం జోరందుకోగా.. కనిపించకుండా పోయిన పక్షులు, పిట్టలు, చిన్న, పెద్ద జంతువులు, ఇలా అనేక వన్యప్రాణులు తిరిగి ప్రకృతితో మమేకమవుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలస్తున్న గజ్వేల్ ప్రాంతంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
గజ్వేల్, జనవరి 1 : వాతావరణ మార్పులు.. ప్రకృతి వైపరీత్యాలు శతకోటి జీవరాశుల మనుగడకు పెనుసవాలుగా మారాయి. కొన్ని జాతులు అంతరించిపోతుండగా, మరికొన్ని జా తుల మనుగడ ప్రమాదపుటంచుల్లో ఉం ది. మనిషి తన సౌకర్యం, సుఖం కోసం ఏకపక్షంగా చేస్తున్న వినాశనానికి జీవివైవిధ్యం ఊహించని రీతిలో దెబ్బతింటున్నది. అయితే, కొద్ది కాలంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. మనదేశం అందులోనా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఏడు విడుతల్లో నిర్వహించిన హరితహారం విజయవంతమైంది. దశలవారీగా నాటిన మొక్కలు నేడు చెట్లుగా ఎదిగి ఎటు చూసినా పచ్చదనాన్ని పంచుతున్నాయి. పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వానలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. వ్యవసాయం జోరందుకోగా.. కనిపించకుండా పోయిన పక్షులు, పిట్టలు, చిన్న, పెద్ద జంతువులు ఇలా అనేక వన్యప్రాణులు తిరిగి ప్రకృతితో మమేకమవుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలస్తున్న గజ్వేల్ ప్రాంతంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
హరితహారం గజ్వేల్ పరిసర ప్రాంతాల రూపురేఖల్ని మార్చేసింది. ఒకప్పుడు బీడుభూములు, ఎడారి ప్రాంతాలను తలపించిన ఈ ప్రాంతం నేడు పచ్చని బయళ్లతో కనువిందు చేస్తున్నది. ఎటుచూసినా అందమైన అడవులతో పాటు పల్లె ప్రాంతాల్లోనూ పచ్చదనం బాగా వెల్లివిరుస్తున్నది. దీంతో, వన్యప్రాణులు ఒక్కొక్కటిగా గజ్వేల్ ప్రాంతాన్ని నివాసంగా మార్చుకుంటున్నాయి. నల్లజింకలు, కృష్ణజింకలు, రసూల్ వైపర్(అత్యంత ప్రమాదకరమైన పాము), ముంగిసలు, కుందేళ్లు, నక్కలు, ఉడుములు, టర్కీ పక్షులు, ముళ్లపందులు, అడవిపందులు, పునుగుపల్లి, అడవిపిల్లి, తెల్ల గుడ్లగూబలతో పాటు వివిధ దేశాలు, మనదేశంలోని ఎన్నోరకాల పక్షులను గజ్వేల్ ఆకర్షిస్తున్నది. రెండేండ్లుగా ఈ ప్రాంతంలో చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు ఉండడంతో పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఇక్కడవున్న వన్యప్రాణులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటి కదలికలను కెమెరాల్లో బంధిస్తున్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, క్యాసారం, మండల పరిధిలోని దాచారం, బయ్యారం, ర్యాగట్లపల్లి, కోమటిబండ తదితర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
స్థిరనివాసాలు ఏర్పరుచుకుంటున్నాయి..
రెండేండ్లుగా గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నా మిత్రుడు శ్రీనాథ్‌తో కలిసి ఫొటోగ్రఫీ చేస్తున్న. గజ్వేల్ మండలంలోనే ఎక్కువగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాండవుల చెరువు, ముట్రాజ్‌పల్లి, క్యాసారం ప్రాంతాల్లో అనేక రకాల పక్షులు ఉన్నాయి. చాలా అరుదైన జాతికి చెందిన పక్షులు ఇక్కడికి వస్తున్నాయి. ఒక్కోసారి వేల సంఖ్యలో వలస పక్షులు కనిపిస్తాయి. రోడ్డు ప్రమాదాల్లో చాలా వన్యప్రాణులు చనిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగుకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.