నిజాంపేట, డిసెంబర్ 20 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా గ్రామస్తుల అభిప్రాయ సేకరణపై నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విదార్థులు చదువుతో పాటు ఆటల్లో ప్రతిభ చూపుతూ, క్రీడా ప్రాంగణాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. చల్మెడ నుంచి నందగోకుల్, నస్కల్, రాంపూర్, నిజాంపేట వరకు బీటీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.40 కోట్ల నిధులు మంజూరు చేసిందని, రోడ్డు నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధి రాములు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, మండల ప్రత్యేకాధికారి నాగరాజు, పంచాయతీ రాజ్ డీఈ పాండురంగారెడ్డి, ఏఈ విజయ్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, సర్పంచులు కవిత, అమరసేనారెడ్డి, గేమ్‌సింగ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు దుర్గయ్య, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, డైరెక్టర్లు కిష్టారెడ్డి, అబ్దుల్ అజీజ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, నాయకులు నగేశ్, ఎల్లం, రాజు, నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.