మంత్రి, ఎంపీ ఆదేశాలతో మక్కరాజిపేటలో డిజిటల్ సర్వే
చేగుంట, ఫిబ్రవరి 26 : రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరువ తీసుకుంటున్నదని ఆర్అండ్బీ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్రావు ఆధ్వర్యంలో మండలంలోని మక్కరాజిపేట గ్రామంలో వాహనాల బరువు, రోడ్డు పరిమాణాలను డిజిటల్ సర్వే ద్వారా శనివారం పరిశీలించారు. చేగుంట నుంచి గజ్వేల్ రహదారిలో వాహనాలు అధికంగా వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, మక్కరాజిపేటతో పాటు పలు గ్రామాలకు చెందిన ప్రజలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి, ఎంపీ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆర్‌ఆండ్‌బీ అధికారులను సూచించారు. దీంతో రాష్ట్ర ఆర్అండ్బీ, చీఫ్ ఇంజినీర్ రవీందర్రావు ఆధ్వర్యంలో సర్వే చేశారు. రోజుకు మూడు వేలకు పైగా వాహనాలు లోడ్‌తో సుదీర్ఘ ప్రాం తాల నుంచి వెళ్తున్నట్లు, చేగుంట నుంచి వయా తూప్రాన్ మీదుగా గజ్వేల్‌కు 60 కిలో మీటర్లు డిస్టెన్స్ ఉండడంతో, వయా మక్కరాజిపేట మీదుగా వాహనాలు వెళ్తున్న ట్లు డీఈ తెలిపారు. కార్యక్రమం లో సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ బండి కవిత, మేలుకొలుపు వార్డు సభ్యుడు, రాష్ట్ర అధ్యక్షుడు కర్రె రమేశ్, టీఆర్ఎస్ నాయకులు బండి విశ్వేశ్వర్, జింక శ్రీనివాస్, సత్తిరెడ్డి, బిట్స్ పీలాని హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్ శ్రీధర్, రా జు, బంధన్, స్కాలర్స్ భానుప్రసాద్, వినీ షా, మల్లికార్జున్, హర్షిత, విజయ్, సిద్ధార్థ ఉన్నారు.
మంత్రి, ఎంపీ ఆదేశాలతో చర్యలు
మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో ఆర్అండ్బీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. సర్వే చేసి నాణ్యతతో కూడిన రోడ్డు వేస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
– కుమ్మరి శ్రీనివాస్, సర్పంచ్, మక్కరాజిపేట