హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 8:ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు కృషిచేయాల్సిన అవసరం ఎంతై నా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మచెరువు ప్రాంతంలో రూ.24లక్షలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తేవడంతో ప్రజలకు ఉపయోగపడుతున్నది.
ఓపెన్ జిమ్‌కు వచ్చి వ్యాయామం చేసే పట్టణ వాసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో వ్యాయామానికి నిరీక్షణ తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక మరిన్ని ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందిగా మారింది. మనిషి మనుగడకు ఆరోగ్యం ప్రధానమైనది. ఆరోగ్యాన్ని పంచేందుకు జిమ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి.
శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు ధృడంగా ఉంచేందుకు వ్యాయా మం దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా హుస్నాబాద్ పట్టణానికి నలువైపులా ఓపెన్‌జిమ్ లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎల్లమ్మచెరువు సమీపంలో మా త్రమే ఓపెన్ జిమ్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాయాయానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అవకాశం కొరకు గం టల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది.
ఈ పరిస్థితుల్లో పట్టణానికి నలువైపులా మరిన్ని ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రభు త్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రభు త్వం ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ దృష్టిసారించి మరిన్ని ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.