బల్దియాతో సరి.. అధికారులేరీ
సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి న ప్రభుత్వం, సిబ్బందిని నియమించడం మరిచింది. దీంతో పౌరసేవలు, అభివృద్ధిపై ప్రభావం పడుతున్నది. 2025 జనవరి 27న కోహీర్ పట్టణాన్ని మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది.
- కోహీర్ మున్సిపాలిటీకి అధికారులను కేటాయించని ప్రభుత్వం
- ఒక్క కమిషనర్ మాత్రమే దిక్కు
- పడకేసిన పాలన.. కుంటుపడిన అభివృద్ధి
- ఇబ్బందుల్లో ప్రజలు
కోహీర్, జూలై 31: సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి న ప్రభుత్వం, సిబ్బందిని నియమించడం మరిచింది. దీంతో పౌరసేవలు, అభివృద్ధిపై ప్రభావం పడుతున్నది. 2025 జనవరి 27న కోహీర్ పట్టణాన్ని మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీగా మారిన ఈ 18 నెలల కాలంలో తొమ్మిది మంది కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కమిషనర్లు ఇక్కడ చేసేదేమీ లేక అయిష్టంగానే బదిలీపై వెళ్లిపోయారు. నారాయణపేట నుంచి వచ్చిన మున్సిపల్ కమిషనర్ శశిధర్ మే 31వ తేదీ నుంచి కోహీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కేవలం ఒక కమిషనర్‌తోనే పనులన్నీ నెట్టుకొస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారి, బిల్ కలెక్టర్, శానిటరీ కలెక్టర్, సర్వేయర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తదితర అధికారులను నియమించాల్సి ఉన్నా, ఇంతవరకు ప్రభుత్వం కేటాయించడం లేదు. కోహీర్ బల్దియాలో 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వార్డుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంది. అన్ని శాఖల అధికారులు ఉంటేనే నిధులు సమకూరి పట్టణం అభివృద్ధి కానుంది. ఇటీవల ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్, రాష్ట్ర అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. కోహీర్ మున్సిపాలిటీకి వెంటనే సిబ్బందిని కేటాయించాలని కోరారు.
త్వరలో కేటాయించే అవకాశం..
కోహీర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం కమిషనర్‌గా పనిచేస్తున్నా. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఆయాశాఖల అధికారులు,సిబ్బంది నియామకం జరిగే అవకాశం ఉంది. ఇంతవరకు స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా రూ.10లక్షలు మంజూరయ్యాయి. వాటితో బాలికల పాఠశాల పక్కన మరుగుదొడ్లు నిర్మిస్తాం.
– శశిధర్, కోహీర్ కమిషనర్(సంగారెడ్డి జిల్లా)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

