కోహీర్, డిసెంబర్1: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పలు బ్యాంకులు, పీచెర్యాగడి, మాచిరెడ్డిపల్లి, బిలాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు పంటరుణమాఫీ కాలేదు.
శనివారం ప్రభుత్వం పంట రుణమాఫీ జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే..ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కవేలి గ్రామంలో మొబైన్ ఫోన్లో పంటరుణమాఫీ జాబితాను రైతులు పరిశీలించగా పేర్లు కనిపించకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పిందని వారు గుర్తు చేశారు. ప్రభుత్వం ముందుగా రూ.2లక్షలు వేస్తే మిగతా డబ్బులు బ్యాంకుల్లో కడతామన్నారు. పంట రుణమాఫీ విషయంపై మండల వ్యవసాయాధికారి నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా పూర్తి వివరాలు బ్యాంకుల్లో ఉంటాయన్నారు.