దుబ్బాక, డిసెంబర్ 8: భారీ మెజార్టీతో గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి శుక్రవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మ, కార్యాలయ సిబ్బంది, వంద పడకల దవాఖాన వైద్య బృందం సిబ్బంది తదితరులు కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొత్త కిషన్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుబ్బాకలో పలు వివాహా శుభకార్యాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
దుబ్బాక మండలం చీకోడు బీఆర్ఎస్ నాయకుడు వెంకట్‌రెడ్డి కూతురు వివాహంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆనంతరం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బందారం కిష్టాగౌడ్ కూతురు వివాహం, ఎనగుర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ అంజాగౌడ్ కూతురు వివాహాలకు ఎమ్మెల్యే హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆయన వెంట దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి, కిషన్‌రెడ్డి సురేశ్‌గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాక మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, పెద్దగుండవెల్లి సర్పంచ్ సద్ది రాజిరెడ్డికి మాతృవియోగం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పెద్దగుండవెల్లికి చేరుకుని, రాజిరెడ్డి మాతృమూర్తి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆనంతరం రాజిరెడ్డికి, వారి కుటుంబీకులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.