చేర్యాల, జూలై 17: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుం డీల లెక్కింపులో బంగారు గొలుసు చోరీ చేసి చెత్తబుట్టలో వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ ఈవో బాలాజీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు లు బుధవారం మల్లన్న ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు, వాటి పనితీరు ఎలా ఉంది..అనే కోణంలో విచారణ ప్రారంభించడంతో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది భయాందోళనలో ఉన్నారు.
హుండీల లెక్కింపుల్లో చోరీకి య త్నం విషయంలో దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హనుమంతరావు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. కమిషనర్‌కు పలువురు వాట్సాప్‌లు పం పించడంతో బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలిగించాలని ఆలయ ఈవోకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. ఆలయ వర్గాలు కేవ లం బంగారు గొలుసు చోరీకి యత్నం జరిగిందని అంటుండగా ఉంగరం సైతం ఎత్తుకుపోయారని పలువురు తెలుపుతున్నారు.
ఆలయంలో మొత్తం 40 సీసీ కెమెరాలు ఉండగా అందులో 32 కెమెరాలు మా త్రమే పని చేస్తున్నాయి. ఆలయ మహామండపంలో కేవలం నాలుగు కెమెరా లు ఉండగా అందులో ఒక కెమెరా సక్రమంగా పని చేస్తుండగా, మరో రెండు కెమెరాలు ఏర్పాటు చేసిన దిశలో కాకుం డా మరో యాంగిల్లో పనిచేస్తున్నా యి. హుండీల లెక్కింపు సందర్భంగా బంగారు, వెండి ఆభరణాలు తీసుకొచ్చి ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, తదితరులు కూర్చొని చోట ఉన్న ట్రేలలో భద్రపరుస్తారు. వచ్చిన ఆభరణాలను తూకం వేసిన అనంతరం వాటి బరువు తదితర వివరాలను రికార్డులో నమోదు చేస్తుంటారు. ఈ ప్రదేశాన్ని కవర్ చేస్తూ రికార్డు చేసే సీసీ కెమె రాలు కొన్ని మాసాలుగా పని చేయడం లేదు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో హుం డీల లెక్కింపులో చోరీకి యత్నించిన వ్యక్తులను మూడు రోజుల్లో పట్టుకుంటామని పోలీసు వర్గాలు తెలిపాయి. పీసీలు విచారణ ప్రారంభించారని, చోరీకి య త్నించిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.