పటాన్చెరు, అక్టోబర్ 1: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో చెత్త నిర్వహణ అధ్వానంగా మారింది. ముత్తంగి గ్రామాన్ని సెప్టెంబర్ 3న తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశా రు. పంచాయతీనుంచి మున్సిపల్‌గా మారిన ముత్తంగిలో నెలరోజులుగా చెత్త నిర్వహణ అస్తవ్యస్తంగా మా రింది. టన్నులకొద్ది వస్తున్న చెత్తను సుచిర్ ఇండియా వెంచర్ ముందు జేసీబీ గుంతల్లో వేస్తున్నారు. ముత్తంగి, ఇస్నాపూర్, పాశమైలారం వైపుగా వస్తున్న చెత్తవాహనాలన్నీ ఈ గుంతలో చెత్తను వేస్తున్నాయని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
ఆ సర్వే నెం బర్లు ముత్తంగి గ్రామ పరిధిలో ఉండటంతో ఆ గుంతపై పూర్తి హక్కులు ఆ గ్రామానికే ఉన్నాయి. గతంలోనూ ఈ గుంతల్లో చెత్తను వేయడంతో ప్రజలు అభ్యంతరం పెట్టారు. అప్పుడు పంచాయతీ కార్యదర్శి చెత్తను డంప్‌యార్డుకు తరలించి సిబ్బందిని పెట్టి ఎవరూ చెత్త వేయకుండా చేశారు. తెల్లాపూర్ పంచాయతీలో ముత్తంగి మేజర్ పంచాయతీని విలీనం చేయడంతో చుట్టుపక్కల ఉన్న చెత్తను తరలించే ఆటోవాలాలకు మళ్లీ అవకాశం లభించింది.
మున్సిపల్ అధికారుల, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో భారీగా చేరిన చెత్తతో సుచిరిం డియా ముందు పరిసరాలు దుర్గంధమయంగా మారా యి. ముత్తంగిలోని వివిధ కాలనీల్లో 17 ఆటోవాలాలు చెత్తను సేకరిస్తారు. తడి, పొడి చెత్త పేరున తెచ్చిన చెత్తను ఈ గుంతల్లో, రోడ్డు పక్కన వేస్తున్నారు. ఇప్పు డు పరిస్థితి ఎలా తయారైందంటే ముత్తంగి గ్రామం నుంచి పాశమైలారం , కర్ధనూర్ వెళ్లే రోడ్డు చెత్తతో కప్పబడి పోయింది. ప్రజలు ఈ దుర్ఘంధం భరించలేక చుట్టు తిరిగి ఆయా గ్రామాలకు ప్రయాణిస్తున్నారు.
భారీగా పేరుకుపోయిన చెత్తను తగలబెట్టి పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. చెత్త తగల బెట్టినప్పుడు ప్రధా న రహదారిపైన ప్రయాణించడం ప్రమాదకరంగా మా రింది. పొగతో రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐడీఏ పాశమైలారం, కర్ధనూర్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రారం భం కాకముందే ముత్తంగి చెత్తతో అధ్వానంగా మారిం ది. మున్సిపల్ సిబ్బందినే చెత్తను తగలబెడుతుండటం గమనార్హం. చెత్తను తగలబెట్టడంపై ఆంక్షలు పెట్టిన తెల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రం చెత్తను తగులబెడుతున్నారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మున్సిపల్ చెత్తను వేసేందుకు పెద్ద డంప్‌యార్డును నిర్మించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులనుం చి, గ్రామాలనుంచి తెచ్చిన తడి,పొడి చెత్తను తగులబెడుతున్నారు. ముత్తంగి నుంచి ఆటోల్లో కొల్లూరుకు తరలించాల్సి ఉన్నా 17 ఆటోవాలాలు దూరభారం ఉం దని ఈ గుంతల్లోనే చెత్తను పారవేస్తున్నారు.
ముత్తంగి నుంచి కొల్లూరు 10 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఆటోవాలాలు అంతదూరం పోమని ఈ గుంతల్లోనే డంప్‌చేస్తున్నారు. మున్సిపాలిటీ తరపున చెత్తను వేస్తే రూ. 5వేల జరిమానా విధిస్తామని ప్రజలను హెచ్చరిస్తూ ఫ్లెక్సీలు మాత్రం పెడుతున్నారు. మున్సిపల్ చెత్త నిర్వహణపై కమిషనర్ ఎలాంటి సమీక్ష నిర్వహించడం లేదు.
ఇప్పటి వరకు పౌరసేవ సమాచారం ముత్తంగిలో అందుబాటులోకి తేలేదు. చెత్తలో పందికొక్కులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పంచాయతీలో ఉన్నప్పుడు అన్ని సేవలు పొందిన ప్రజలు ఇప్పుడు మున్సిపాలిటీగా మారడంతో కొత్తగా వస్తున్న సమస్యలను చూసి బెంబేలెత్తుతున్నారు. రోగాలు వ్యాప్తి చెందుతాయని ఆందోళన చెందుతున్నారు.
కొల్లూరులో డంప్‌యార్డుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ స్థలంలోనే ముత్తంగి గ్రామ చెత్తను తరలిస్తాం. చెత్తను తెచ్చే ఆటోడ్రైవర్లను కొల్లూరు వెళ్లాలని చెబుతున్నాం. దూరం అని ఇంధనం ఖర్చు కావాలని వారు డిమాండ్ పెట్టారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో చెత్తను కొల్లూరుకు పంపిస్తాం. చెత్తను తగులబెట్టవద్దని సిబ్బందికి సూచిస్తాం. పారిశుధ్యంపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశాం. సంపూర్ణ పారిశుధ్యం అమలు చేస్తాం. పక్క గ్రామాలనుంచి వస్తున్న చెత్త ఆటోలను సీజ్ చేస్తాం.
– నవోద్రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ అధికారి, ఈవో ముత్తంగి