Air India flight | విమానం ల్యాండ్ అవుతుండగా నేలను తాకిన తోక.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
Air India flight | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి బెంగళూరు (Bengalore) కు వచ్చిన ఎయిరిండియా (Air India) విమానానికి ల్యాండింగ్ సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్‌వే (Run way) పై దిగుతున్న తరుణంలో దాని తోక భాగం భూమిని బలంగా తాకింది. అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు 179 మంది ప్రయాణికులతో వచ్చిన AI 2651 ఎయిర్ బస్ విమానం ల్యాండింగ్ కావడానికి సిద్ధమైంది.
Air India flight : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి బెంగళూరు (Bengalore) కు వచ్చిన ఎయిరిండియా (Air India) విమానానికి ల్యాండింగ్ సమయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్‌వే (Run way) పై దిగుతున్న తరుణంలో దాని తోక భాగం భూమిని బలంగా తాకింది. అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు 179 మంది ప్రయాణికులతో వచ్చిన AI 2651 ఎయిర్ బస్ విమానం ల్యాండింగ్ కావడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో రన్‌వేపై నుంచి మరో పెద్ద విమానం టేకాఫ్ కావడంతో గాల్లో తీవ్రమైన గాలి ఉద్ధృతి ఏర్పడింది. దాంతో విమానం బ్యాలెన్స్ తప్పింది. పైలట్లు ల్యాండింగ్ నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ విమానాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం తోక భాగం రన్‌వేను గీసుకుంటూ వెళ్లింది.
అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిరిండియా సంస్థ ఈ ఎయిర్‌బస్ ఏ321 విమానాన్ని తదుపరి తనిఖీల కోసం ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసింది. దీనివల్ల బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లాల్సిన AI 2652 ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రమాదంపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం దర్యాప్తు పూర్తయ్యే వరకు సదరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిరిండియా గ్రౌండ్ టీమ్స్ ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

