నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి
- మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోవాలి
- మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
- విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాటించాలి
- ఏమైన సంఘటనలు చోటుచేసుకుంటే 100కు సమాచారం ఇవ్వాలి
- సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 27: వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వినాయక ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందిస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు.
వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకునే వారు వెబ్ సైట్లో ఆన్లైన్లో అనుమతులకు http/policeportal. tspolice.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ వారి అనుమతి కూడా తప్పనిసరి అన్నారు. గణేశ్ మండపాలను నాణ్యత కలిగిన వస్తువులతో ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటుచేయకూడదన్నారు. మండపాల వద్ద ముగ్గురు వలంటీర్లు ఉండాలన్నారు. మండపాల వద్ద టపాకాయలు, మందు గుండు సామాగ్రి ఉంచరాదన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు సంబంధిత ఆర్గనైజర్లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. గణేశ్ మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీలు హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మండపాల వద్దకు వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

