అమీన్ పూర్, జూన్ 9: కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఐ ఆనంద్‌నగర్ కాలనీలో నూతనం గా నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘం కమ్యూనిటీహాల్‌ను ఆదివారం ఆయన ప్రార ంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ.. ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామన్నారు. అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. సంక్షే మ సంఘం భవనానికి సంపూర్ణ సహకారం అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ను అభినందించారు. అనంతరం బీరంగూడలోని గోశాలను సందర్శించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.